News January 9, 2026
వరంగల్‌లో పేపర్ లీకేజీ కలకలం!

ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి వరంగల్ వ్యవసాయ కళాశాలలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. కొందరు ఏఈఓలు పదోన్నతుల కోసం విశ్వవిద్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సహాయంతో పేపర్ కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్రులకు చేరవేసినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లాలో పేపర్ లీకేజీని గుర్తించిన అధికారులు వరంగల్ కేంద్రంగా జరిగినట్లు నిర్ధారించుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Similar News
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in
News February 18, 2026
భూ రిజిస్ట్రేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టం: పొంగులేటి

TG: ధరణి పోర్టల్‌లోని వ్యవస్థీకృత లోపాల వల్లనే రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహా సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకు దారితీసింది. వారినెవరినీ వదిలిపెట్టం. కోడ్ ఆడిట్‌కు ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండరాదు’ అని పేర్కొన్నారు.
News February 18, 2026
TU: ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా ఖురేషీ

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా మహమ్మద్ మూసా ఖురేషీని నియమించారు. ఈ మేరకు టీయూ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. గతంలో ఆయన అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఉర్దూ విభాగం HoD, BoS, మైనార్టీ సెల్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఆయనను నియమించడంపై పలువురు అధ్యాపకులు ఆయనను అభినందించారు.


