News January 9, 2026

భూపాలపల్లి: మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం!

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. పోటీకి సిద్ధమవుతున్న వివిధ పార్టీల నేతలు ఇప్పటికే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈసారి ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో టికెట్ల వేటలో నేతలు తలమునకలయ్యారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు పోటీ పడుతుండటంతో అధిష్ఠానానికి ఎంపిక కత్తిమీద సాములా మారింది.

Similar News

News February 3, 2026

OTR అప్‌డేట్‌ చేయకపోతే అవకాశం కోల్పోతారు!

image

TG: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో TGPSC కీలక ప్రకటన చేసింది. కమిషన్‌లో నమోదైన 31.56 లక్షల మంది తప్పనిసరిగా తమ OTR (వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌) వివరాలను అప్‌డేట్‌ చేయాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటో, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. అప్‌డేట్‌ చేయకపోతే భవిష్యత్‌ నియామకాలకు దరఖాస్తు చేసుకోలేరని హెచ్చరించింది.

News February 3, 2026

తూ.గో: సీతానగరంలో పులి సంచారం

image

సీతానగరం గోదావరి లంకల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అడుగుజాడల ద్వారా అటవీశాఖ ధ్రువీకరించిందని తహశీల్దార్ దుర్గాప్రసాద్ తెలిపారు. చిడిపి, కుమారదేవం గ్రామ రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లంక భూముల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. రాత్రివేళల్లో ఒంటరి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. పులి భయంతో లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

News February 3, 2026

ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.