News January 9, 2026

కామారెడ్డిలో దొంగల బీభత్సం

image

కామారెడ్డిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి ఐదు దుకాణాల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 12, 2026

బీర సాగుకు అనువైన విత్తన రకాలు

image

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్‌.ఎస్‌.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.

News January 12, 2026

కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

image

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.

News January 12, 2026

కర్నూలు: ‘పోలీసులనూ నడిరోడ్డుపై నడిపించండి’

image

చట్టం ముందు అందరూ సమానులే. ఇటీవల కొన్ని ఘటనల్లో నిందితులను పోలీసులు రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తప్పులు ఎవరూ చేయకూడదనే సంకేతాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకే ఇలా చేశామంటూ వారు చెప్పుకొస్తున్నారు. పోలీసులు తప్పు చేస్తే రాజీ చేయడం, వీఆర్‌కు పంపడం లేదా సస్పెండ్ చేయడమేనా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో నలుగురు కర్నూలు పోలీసులు <<18825569>>వీఆర్‌<<>>కు వెళ్లిన విషయం తెలిసిందే.