News January 9, 2026

ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గిస్తారా? కేంద్రం సమాధానమిదే

image

ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గించాలన్న ఢిల్లీ HC సూచనలపై కేంద్రం స్పందించింది. GST కౌన్సిల్ సమావేశం కాకుండా పన్ను రేట్లను తగ్గించలేమని తెలిపింది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యత తగ్గడంతో ఎయిర్ ప్యూరిఫయర్లపై GSTని తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాటిపై 18% పన్ను ఉంది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A ప్రకారం GST రేట్లను నిర్ణయించే అధికారం కౌన్సిల్‌కు మాత్రమే ఉందని కేంద్రం పేర్కొంది.

Similar News

News February 18, 2026

ఈ అలవాట్లతో బరువు తగ్గొచ్చు

image

కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర ఎక్కువగా తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్, తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2026

ఎLAW: చిల్లుపై బిల్లుతో పోరాడవచ్చు

image

హోటళ్లలో ఫుడ్ తిన్నాక అస్వస్థతకు గురైతే ఆ మేనేజ్మెంట్‌ను తిట్టుకుని, డాక్టర్‌ను కలిసి మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాం. కానీ మనకు జరిగిన శారీరక, ఆర్థిక, మానసిక నష్టానికి పరిహారం పొంది చట్టపర చర్యలతో మరోసారి, మరొకరికి ఇలా జరగకుండా చూడొచ్చు. దీనికి కావాల్సింది మీ ఫుడ్ బిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. వీటితో ఫుడ్ సేఫ్టీ అథారిటీలో లేదా కోర్టులో కేసు వేయొచ్చు. కాబట్టి డబ్బు చెల్లించగానే బిల్ పడేయకండి.

News February 18, 2026

ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

image

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.