News January 9, 2026

భూపాలపల్లి ఎస్పీ ఫొటోతో ఫేక్ వాట్సాప్!

image

జిల్లాలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జిల్లా ఎస్పీ సంకీర్త్ ఫొటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి మేసేజ్‌లు పంపిస్తున్నారు. ఫర్నీచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని పలువురికి ఎస్పీ ఫేక్ నంబర్‌తో మేసేజ్‌లు వెళ్లాయి. ఇది పోలీసుల దృష్టికి రాగా వారు అప్రమత్తమయ్యారు.

Similar News

News February 9, 2026

ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

image

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.

News February 9, 2026

KMR: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి (UPDATE)

image

కామారెడ్డి పట్టణంలోని రైల్వే <<19085331>>ట్రాక్‌పై గుర్తు తెలియని ఓ మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ మహబూబ్ నగర్‌ జిల్లా వెంగళపల్లెకు చెందిన మీరిగల్ల సరోజనమ్మ(75)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2026

వైకుంఠ పరివారమే ఈ చతుర్విధ అవతారాలు!

image

ధర్మ సంస్థాపన కోసం విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. అయితే విష్ణువు ఒక్కడే కాకుండా ఆయనకు నిరంతరం తోడుగా ఉండే ఆయుధాలు, వాహనం కూడా రాముని సోదరులుగా జన్మించాయి. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాగా ఆయనకు నీడలా ఉండే లక్ష్మణుడు విష్ణువు శయ్య అయిన ఆదిశేషుడి అంశతో జన్మించాడు. భరతుడు విష్ణువు చేతిలోని పాంచజన్యం(శంఖం) అవతారం. శత్రుఘ్నుడు దుష్టసంహారానికి వాడే సుదర్శన చక్రం అంశతో జన్మించాడు.