News January 9, 2026
HYDలో 2 రోజులు వాటర్ బంద్

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
Similar News
News January 12, 2026
బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ ఆజగర్

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ అజగర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అజగర్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అధికారికి కలెక్టర్ సూచించారు.
News January 12, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News January 12, 2026
సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.


