News January 9, 2026
కృష్ణపల్లిలో చిన్నారులపై భోగిపండ్లను పోసి ఆశీర్వదించిన కలెక్టర్

పార్వతీపురం మండలం కృష్ణపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. చిన్నారులు సంప్రదాయ వేషధారణలు వేశారు. అంగన్వాడీ ప్రాంగణలో భోగిమంటలు, హరిదాసు కీర్తనలతో పండగ శోభ సంతరించుకుంది. చిన్నారులకు కలెక్టర్ భోగి పండ్లను వేసి నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డితో పాటు వివిధ శాఖలాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News February 11, 2026
మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ!

రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి, కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చింది. మీకు, మీ కుటుంబానికి మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదని బెదిరిస్తూ సచివాలయంలోని మంత్రి పేషీకి లేఖ అందింది. ఈ బెదిరింపు లేఖపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖ ఎవరు రాసి ఉంటారన్న దానిపై తుళ్లూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.
News February 11, 2026
‘వర్మ’ నెక్స్ట్ స్టెప్ ఏంటి?.. ‘హామీ’ దక్కేనా.. హ్యాండ్ ఇచ్చేనా?

2024 వరకు పిఠాపురంలో తిరుగులేని నేతగా వెలిగిన వర్మ, పవన్ కళ్యాణ్ రాకతో రాజకీయంగా అనిశ్చితిలో పడ్డారు. పవన్ విజయం కోసం త్యాగం చేసినా, జూన్ రాజ్యసభ రేసులో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. మకుటం లేని మహారాజుగా ఉన్న వర్మ తదుపరి కర్తవ్యం ఏమిటి? రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత దక్కుతుందా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
News February 11, 2026
ఖమ్మం జిల్లాలో తొలి రెండు గంటల్లో 15.37% ఓటింగ్

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) సగటున 14.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కల్లూరులో 19.80%, కనిష్ఠంగా మధిరలో 12.72% పోలింగ్ జరిగింది. ఏదులాపురంలో 15.65%, వైరాలో 14.52%, సత్తుపల్లిలో 15.12% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.


