News January 9, 2026

వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో బానిస కూలీల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలన్నారు. చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 1, 2026

హనుమకొండ: మినీ మేడారం జాతరలో 13వేల మందికి చికిత్స

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన మినీ మేడారం జాతరలో 13,242 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు DMHO డా.అప్పయ్య తెలిపారు. హయగ్రీవాచారి మైదానం, ఆత్మకూరు, ఊరుగొండ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ఈ సేవలు అందజేశామన్నారు. మెరుగైన చికిత్స కోసం 19 మందిని పెద్దాసుపత్రికి తరలించామని, 10 మందికి కుక్కకాటు ఇంజక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

News February 1, 2026

HNK: కెనాల్‌లో పడి బాలుడు మృతి

image

ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమారుడు శశివర్ధన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని కెనాల్‌లో పడిపోవడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు బయటికి తీసి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News February 1, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. కరీంనగర్ జిల్లాలో 60 కేంద్రాలు

image

రేపటి నుంచి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 17,257 మంది విద్యార్థుల కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు RIO వి.గంగాధర్ తెలిపారు. హాల్ టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని హైదరాబాద్ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు.