News April 25, 2024
CM పర్యటన నేపథ్యంలో పులివెందులలో ట్రాఫిక్ ఆంక్షలు

CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.
Similar News
News September 8, 2025
వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News September 8, 2025
కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.
News September 8, 2025
ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్‌కు MLA మద్దతు

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పలువురి మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కమిటీ త్వరలో కడప జిల్లా పర్యటనకు వస్తుందని.. అప్పుడు ప్రొద్దుటూరు జిల్లాపై వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.