News January 9, 2026
సిరిసిల్ల : పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

రేపటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
Similar News
News January 29, 2026
గుంటూరు GGHలో రూ.132 కోట్లతో సరికొత్త భవనం

జీజీహెచ్‌లో మాతా–శిశు సంరక్షణ ఏళ్ల తరబడి సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ పరిస్థితిని గమనించిన కానూరి జింకానా సభ్యులు ముందుకొచ్చి రూ.100 కోట్లతో సెల్లార్, జీ+5 అంతస్తుల్లో 597 పడకలతో ఆధునాతన భవనం నిర్మించారు. డా. గవిని ఉమాదేవి రూ.22 కోట్లు విరాళంగా అందించగా, ప్రభుత్వం రూ.27 కోట్ల పరికరాలు సమకూర్చింది. మొత్తం రూ.132 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News January 29, 2026
రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రండి: కేసీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.
News January 29, 2026
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల బరిలో దంపతులు

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. BJP అభ్యర్థులుగా ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు బరిలోకి దిగారు. 19వ వార్డు నుంచి రమనగోని శంకర్, 3వ వార్డు నుంచి ఆయన భార్య దీపిక గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు పోటీ చేస్తుండటంతో పట్టణంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. వీరి నామినేషన్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గెలుపుపై ఇద్దరు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


