News January 9, 2026

MBNR: పిల్లలతో బైక్‌లపై వెళ్లేటప్పుడు తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 2, 2026

MBNR: ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: SP

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆమె ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.

News February 2, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలు.. SP సమీక్ష

image

మహబూబ్‌నగర్ జిల్లా నందు జరగనున్న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపల్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 2, 2026

పాలమూరు: ఇక ప్రచారంపై పూర్తి ఫోకస్..!

image

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు.