News January 9, 2026

తప్పుడు నివేదిక.. TTDకి రూ.118 కోట్ల నష్టం

image

తిరుమల లడ్డూ <<18811889>>కల్తీ నెయ్యి<<>> వ్యవహారంలో విజయభాస్కర్ 2023లో భోలేబాబా కంపెనీ నుంచి రూ.75 లక్షలు, ప్రీమియర్ డెయిరీ నుంచి రూ.8 లక్షలు, అల్ఫా డెయిరీ నుంచి 8 గ్రాముల బంగారంతో పాటు నగదును హవాలా రూపంలో తీసుకున్నాడని తెలుస్తోంది. 2019-2024 వరకు విజయ్ భాస్కర్ ఇచ్చిన ఫేవరబుల్ రిపోర్టు‌ వల్ల TTDకి రూ.118 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తేల్చారు. కాగా ఈయన నుంచి సిట్ రూ.34 లక్షలు సీజ్ చేసినట్లు సమాచారం.

Similar News

News February 28, 2026

నంద్యాలలో మంత్రి ఫరూక్, కలెక్టర్ పింఛన్ల పంపిణీ

image

నంద్యాల పట్టణం 14వ వార్డులోని సద్దులపేట, బుడగ జంగాల వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా ఇందులో పాల్గొన్నారు. ఆదిలక్ష్మి, బాల జయమ్మ, కడియం చెన్నయ్యలకు పింఛన్లను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై మంత్రి ఆరా తీశారు.

News February 28, 2026

HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News February 28, 2026

చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టమాటా, మామిడి రైతుల కష్టాల గురించి ఏ ఒక్క MLA ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.