News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Similar News
News February 25, 2026
భారీగా పెరిగిన ‘బంగినపల్లి’ ధర

AP: ఈ ఏడాది మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన <<19097565>>బంగినపల్లి<<>> మామిడి టన్ను రేటు ₹1.80 లక్షలు, తోతాపురి ₹లక్ష పైనే పలుకుతున్నాయి. ప్రభుత్వం కవర్లకు 50% రాయితీ ఇస్తుండటంతో ఎక్కువ మంది రైతులు వాడేందుకు ముందుకొస్తున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత రెట్టింపు అయ్యిందని, తెగుళ్లు, పక్షులు, జంతువుల నుంచి రక్షణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 10L ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.
News February 25, 2026
కార్మికులకు గుడ్ న్యూస్: 40 దాటితే హెల్త్ చెకప్!

40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. ESIC 75వ వేడుకల్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయం చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి రిఫరల్స్ తగ్గించాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించేలా ఒప్పందం చేసుకున్నారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని, ESIC సేవలు ఎయిమ్స్ (AIIMS) స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
News February 25, 2026
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

TG: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణ వ్యాప్తంగా 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెంటర్‌కు స్టూడెంట్స్ గంట ముందే చేరుకోవాలి. అయితే పరీక్ష స్టార్ట్ అయిన ఐదు నిమిషాల వరకు లోపలికి అనుమతించనున్నారు. సెంటర్లను CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.


