News January 9, 2026
అమరావతి ఆవకాయ ఉత్సవాల్లో కలెక్టర్

విజయవాడ భవానీ ద్వీపంలో నిర్వహించిన ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. రెండో రోజు చేపట్టిన కార్యక్రమాలు నగరవాసులు, పర్యాటకుల నుంచి విశేష స్పందనను పొందాయి. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నగాడా వాయిద్యాలు ప్రాంతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించగా, సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
News February 15, 2026
‘శివోహం జాగరణ’లో సీఎం: పటిష్ట భద్రత

మహాశివరాత్రి సందర్భంగా నంబూరు వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన ‘శివోహం జాగరణ’కు సీఎం హాజరయ్యారు. ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారియా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 15, 2026
బాపట్లలో పండగ పూట విషాదం

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.


