News January 9, 2026
నిమ్మకాయల నివాసంలో మంత్రి నారాయణ కీలక భేటీ

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ శుక్రవారం మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించిన ఆయన, ఆది నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని స్థానిక రాజకీయ పరిణామాలను మంత్రికి వివరించారు.
Similar News
News January 24, 2026
రెండేళ్లలో రూ.40 వేల కోట్ల రుణాలు: మంత్రి సీతక్క

రెండు సంవత్సరాలుగా రూ.40 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. కెసముద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు 68 లక్షలు అయ్యారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కేసముద్రం మహిళ సంఘాలకు 2 బస్సులు ఇస్తున్నామన్నారు.
News January 24, 2026
కర్నూలు రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రైల్వే స్టేషన్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందాలతో రైల్వే పార్శిల్ కార్యాలయం, వెయిటింగ్ హాలు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ సీఐ నాగరాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలు ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలుగా పోలీసులు తెలిపారు.
News January 24, 2026
ఎన్నికల ముంగిట మున్సిపాల్టీలకు ₹1000 కోట్లు

TG: మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిలో కనీస మౌలిక వసతులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టింది. వీటికోసం అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో TUIFDC ద్వారా చేపట్టే పనులకోసం ₹1000 కోట్ల నిధులను రుణం కింద తీసుకుంటోంది. హడ్కో నుంచి సేకరిస్తున్న ఈ రుణంతో పనులు ప్రారంభించనున్నారు. కాగా ఈ రుణాన్ని నెలవారీ వడ్డీతో వాయిదాల రూపంలో ప్రభుత్వం హడ్కోకు చెల్లించనుంది.


