News April 25, 2024
506 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర సాయుధ బలగాల్లో (CAPF) 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నేటి నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 4న రాతపరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://upsconline.nic.in/
Similar News
News January 29, 2026
RO-KO కోసం రూల్స్ మారనున్నాయ్!

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడిన మ్యాచులు ప్రసారం కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అవి లైవ్ టెలికాస్ట్ కాకపోవడానికి కారణం 100 దేశవాళీ మ్యాచులు మాత్రమే లైవ్ చేసేలా టెలివిజన్ సంస్థతో BCCIకి ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్నే మార్చనున్నట్లు, 100కు మించి మ్యాచులు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
News January 29, 2026
ఉపవాసంలో ఏయే పదార్థాలు తీసుకోవచ్చు?

ఏకాదశి ఉపవాసంలో ధాన్యాలకు(బియ్యం, గోధుమలు) దూరం ఉండాలి. పాలు, పెరుగు, వెన్న వంటి పాడి పదార్థాలు కొద్దిమేర తీసుకోవచ్చు. అన్ని రకాల పండ్లు కూడా తినవచ్చు. జ్యూస్ చేసుకుంటే మాత్రం చక్కెరకు దూరం ఉండటం మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణ ఉప్పు వాడకూడదట. బదులుగా సైంధవ లవణం వాడాలని పండితులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగుతుండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తినొచ్చు.
News January 29, 2026
మొక్కజొన్న ఆకులు ఈ రంగులోకి మారాయా?

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.


