News January 9, 2026
విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (1/2)

విశాఖ మెట్రో ప్రాజెక్టు మరోసారి <<18813242>>జాప్యం<<>> దిశగా సాగుతోంది. తాజాగా కేంద్రం ఫీజబులిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరడంతో ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPRపై కేంద్రం కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, నిర్వహణ వ్యయం, బ్రేక్ ఈవెన్ కాలంపై స్పష్టత కోరింది.
Similar News
News February 16, 2026
సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్‌కు అనుమతి..

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు కోరారు.
News February 15, 2026
మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News February 15, 2026
రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

రుషికొండ బీచ్‌లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్‌తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.


