News January 10, 2026
టెన్త్‌లో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ తేజస్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో సూర్యాపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ఎంఈఓలు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, 2 ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థికి అభ్యాసన దీపికాలతో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 2, 2026
శ్రీశైలంలో నేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సమీక్ష సమావేశం జరగనుంది. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. సమీక్షలో పలువురు మంత్రులతోపాటు నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
News February 2, 2026
శ్రీశైలంలో నేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సమీక్ష జరగనుంది. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. సమీక్షలో పలువురు మంత్రులతోపాటు నాగర్‌కర్నూల్, నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
News February 2, 2026
హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం ఆదివారం లభ్యమైంది. నీటిపై తేలుతున్న మృతదేహాన్ని గుర్తించిన లేక్ పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.


