News January 10, 2026

ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకం

image

ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కమిటీ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ శుక్రవారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బుర్రి శ్రీకర్, ఉపాధ్యక్షులుగా మరుబరిక శ్రీనివాస్, తిరివీధి రాజేంద్రప్రసాద్, మొవ్వ ఫణీంద్ర కుమార్, గంజి బాలాజీ, జనరల్ సెక్రటరీలుగా రాయల నాగమల్లేశ్వరరావు, పగుర్ల చిట్టి బాబు నియమితులయ్యారు.

Similar News

News February 19, 2026

తిరుపతి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

తిరుపతిలో గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే రెవెన్యూ, భూసంబంధిత అర్జీలను పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రీసర్వే, కుల ధృవీకరణ పత్రాల వంటి సేవలను ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని సూచించారు. అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సంతృప్తికర పరిష్కారం అందించాలని కోరారు.

News February 19, 2026

బాపట్ల తీరానికి ‘గోవా’ కళ

image

బాపట్ల తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు గోవాలో పర్యటించనుంది. తీర ప్రాంత నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి, బాపట్ల తీరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ బృందం 22న తిరిగి విజయవాడకు చేరుకోనుంది.

News February 19, 2026

ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

image

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.