News January 10, 2026
HYD: డిఫెన్స్ భూములతో భారీ కారిడార్!

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లో ఉన్న సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని అధికారులు Way2Newsకు తెలిపారు.
Similar News
News February 20, 2026
ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8
News February 20, 2026
పార్వతీపురం: ‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి’

జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణాలను ఉగాది పండగ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్, పీఎం గ్రామీన్, పీఎమ్ఏవై పథకాల కింద నిర్మిస్తున్న మొత్తం 7,187 గృహాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5,594 గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News February 20, 2026
VJA: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

విజయవాడలోని సాయిరాం థియేటర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)ను ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన హేమంత్ నాగసాయి అనే వ్యక్తి మాయమాటలతో బాలికను లోబర్చుకొని, శారీరకంగా లొంగదీసుకున్నట్లు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ కొండలరావు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


