News January 10, 2026
చైల్డ్ పోర్న్ బ్రౌజింగ్.. 24 మంది అరెస్ట్

TGలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో <<18800907>>అరెస్ట్<<>> చేసి కౌన్సెలింగ్ ఇస్తోంది. సైబర్ టిప్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదులతో HYDలో 15, WGLలో ముగ్గురు, NZBలో ఇద్దరు సహా మొత్తం 25మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖలో జూ.అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా ఉన్నాడు. చైల్డ్ పోర్న్ చూసేవారిని ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్&అబ్యూస్ మెటీరియల్ గుర్తిస్తోంది.
Similar News
News March 24, 2026
రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.
News March 24, 2026
RDT ఎలా ఏర్పాటైంది? వివాదమేంటి?

AP: 1969లో విన్సెంట్ ఫెర్రర్(స్పెయిన్) అనంతపురంలో కరవును తరిమికొట్టాలని RDTని స్థాపించారు. విద్య, వైద్యం, నీటి సంరక్షణ, రైతులకు శిక్షణ, స్వయం ఉపాధి, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంస్థ ప్రస్తుతం AP, TGలోని 3,500 గ్రామాల్లో సేవలు అందిస్తోంది. విదేశీ నిధులకు కీలకమైన FCRA లైసెన్స్‌ను 2023లో కేంద్రం నిలిపివేయడంతో వివాదం మొదలైంది. తాజాగా దాన్ని <<19461876>>రెన్యువల్<<>> చేసింది.
News March 24, 2026
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌తో చర్చలు చేపడతామని ట్రంప్ ప్రకటించడంతో ఈరోజు మార్కెట్లకు ఊరట లభించింది. సెన్సెక్స్ 865 పాయింట్ల లాభంతో 73,571కు చేరగా నిఫ్టీ 275 పాయింట్లు ఎగిసి 22,841 వద్ద ట్రేడవుతోంది. నిన్న చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ కోలుకోవడం, కొనుగోల్లు పెరగడం కలిసొచ్చింది. అయితే ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది.


