News January 10, 2026

KNR: ‘పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

image

మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్‌, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.

Similar News

News February 2, 2026

KNR: రేపటితో ముగియనున్న ‘బి-ఫామ్’ల గడువు

image

కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అభ్యర్థులు తమ పార్టీల అధికారిక ‘బి-ఫామ్‌’లను సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోపు పత్రాలు అందని పక్షంలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కేటాయింపుపై పార్టీల అగ్రనేతలు కసరత్తు కొనసాగిస్తుండగా, ఆశావహులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

News February 2, 2026

కరీంనగర్ ‘పుర’పోరు.. మేయర్ పీఠంపై ముమ్మర వ్యూహాలు

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్‌కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.

News February 2, 2026

కరీంనగర్‌కు దక్కని ‘పద్దు’ ఊరట

image

KNRకు బడ్జెట్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్‌పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్‌టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.