News January 10, 2026

కరీంనగర్: మున్సిపాలిటీ రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నాయకులతోపాటు ఆశావహులు సైతం రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో లేవో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను రొటేషన్‌ పద్ధతిలో కేటాయించారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మార్చే అవకాశం ఉంది. దీంతో వార్డుల రిజర్వేషన్ అంశంపై చర్చ జరుగుతోంది.

Similar News

News March 4, 2026

అనంతపురంలో పడిపోయిన ధరలు

image

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.

News March 4, 2026

చిరంజీవి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరు స్టైలిష్‌గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.

News March 4, 2026

భూపాలపల్లి: రైతు భరోసా ఇంకెన్నడూ?

image

జిల్లాలో యాసంగి పంటలు చేతికి వస్తున్నా పెట్టుబడి సాయం అందక రైతులు అల్లాడుతున్నారు. జిల్లాలో 1,24,496 మంది రైతులు ఉండగా, వానాకాలం సీజన్‌లో 1,02,153 మందికి కేవలం రూ. 95.95 కోట్లు మాత్రమే అందాయి. ప్రస్తుత యాసంగిలో సాయం ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.