News January 10, 2026
మోచేతులు నల్లగా ఉన్నాయా?

కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటాయి. ఈ సమస్యను తగ్గించడానికి అలోవెరా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అలోవెరా జెల్‌ని నేరుగా మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసి కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలకు బాగా తేమ అంది, నల్లబడిన స్కిన్ టోన్ మారుతుందని చెబుతున్నారు.
Similar News
News March 13, 2026
జైశంకర్ స్కెచ్.. అగ్రరాజ్యానికి బ్రిక్స్ చెక్?

విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు BRICS విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. US/ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జైశంకర్ వరుసగా ఇరాన్‌తో చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఏకపక్ష నిర్ణయాలతో, ఆధిపత్య వైఖరిని ప్రదర్శిస్తున్న USకు చెక్ పెట్టడమే లక్ష్యంగా BRICSను బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
News March 13, 2026
మాజీ DGP HJ దొర కన్నుమూత

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.
News March 13, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

*మిషన్ శక్తి కింద ‘సఖీ నివాస్’ పేరుతో వర్కింగ్ ఉమెన్స్‌కు హాస్టళ్లు
*అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు.
*సచివాలయం, HOD టవర్ల పనులకు గ్రీన్ సిగ్నల్. మెకానికల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల కోసం ₹2,316 కోట్లకు అనుమతులు.
*FRA పట్టాదారులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం
*పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో పనులకు ₹23.47 కోట్లు, ప్యాకేజీ-64A పనులకు ₹24.51 కోట్లు.


