News January 10, 2026
నేడు ఇవి దానం చేస్తే?

పుష్య మాస శనివారాల్లో చేసే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో పేదలకు కంబళ్లు, దుప్పట్లు, వస్త్రాలను దానం చేయాలి. ఇవేకాక నల్ల నువ్వులు, బెల్లం, నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర మాసంలో స్నాన, జప, తపాదులతో పాటు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. పరులకు చేసే సాయమే దేవుడికి చేరే నిజమైన పూజ.
Similar News
News February 23, 2026
పాలు, నూనెల నమూనాల రిపోర్టు వెంటనే ఇవ్వాలి: సత్యకుమార్

AP: రాజమండ్రిలో సేకరించిన పాలు, నూనెల పరీక్ష పూర్తిచేసి వెంటనే నివేదిక అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కల్తీపాలతో మరణాల నేపథ్యంలో వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా ఆ నమూనాలతో పాటు బాధితుల రక్తనమూనాలను కూడా ల్యాబ్‌లకు పంపామని అధికారులు తెలిపారు. నివేదిక వస్తే పాలలో రసాయనాల కల్తీ నిర్ధారణ అవుతుందన్నారు.
News February 23, 2026
చెరకు పంటలో ఇనుపధాతు లోపం – నివారణ

చెరకు పంట పిలకదశలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుంచి తెలుపు రంగుకు మారతాయి. ఈ లక్షణాలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడి ఈనెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవునా చారలు ఏర్పడతాయి. ఇనుప ధాతు లోపం ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి వారం, పది రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.