News January 10, 2026
జిల్లాల కుదింపు.. నల్గొండ రెండు జిల్లాలేనా..?

రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. చాలా జిల్లాల్లో గందరగోళం ఉండటంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలుగా సర్కార్ కుదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్‌ను ఒక్క జిల్లాకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సర్కార్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జిల్లాలు (NLG, యాదాద్రి, SRPT)గా విభజన చేశారు.
Similar News
News February 5, 2026
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News February 5, 2026
అర్ధరాత్రి నుంచి OTTలో ‘రాజాసాబ్’

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. అటు శివకార్తికేయన్, శ్రీలీల తదితరులు నటించిన ‘పరాశక్తి’ మూవీ ఈ నెల 7న జీ5లో విడుదల కానుంది.
News February 5, 2026
ఆస్పత్రిపాలైన సర్ఫరాజ్ ఖాన్!

రేపు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై-కర్ణాటక జట్లు తలపడనున్నాయి. ఈ టైమ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కర్ణాటకతో నాకౌట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆడడంపై సందేహం వ్యక్తం చేసింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ సీజన్‌లో HYDపై చేసిన డబుల్ సెంచరీతో కలిపి సర్ఫరాజ్ 9 ఇన్నింగ్సుల్లో 429 రన్స్ చేశారు.


