News January 10, 2026
గాడిపల్లి-రంగశాయిపేట రోడ్డు కోసం భూసేకరణ!

మామునూర్ ఎయిర్‌పోర్టు కారణంగా మూసివేతకు గురవుతున్న రంగశాయిపేట-గాడిపల్లి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. గాడిపల్లి నుంచి నక్కలపల్లి, దున్నాల కాలనీ, అక్షర టౌన్ షిప్, బొల్లికుంట చెరువు రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డును కలిపేందుకు 5.50కి.మీ రోడ్డు కోసం 36.28ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. రూ.95 కోట్లను మంజూరు చేయాలని R&Bఅధికారులు నివేదిక పంపారు.
Similar News
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్‌లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
సిద్దిపేట: ‘చైతన్యం ద్వారా మోసాలను అరికట్టవచ్చు’

సిద్దిపేటలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సివిల్ సప్లైస్ విభాగం ఆధ్వర్యంలో చైతన్య సదస్సు డీఎస్ఓ తనూజ అధ్యక్షతన నిర్వహించారు. మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆమె సూచించారు. చైతన్యం ద్వారానే మోసాలను అరికట్టవచ్చన్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.


