News January 10, 2026
VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 19, 2026
గుంటూరు-గుంతకల్‌కు రైల్వే సొరంగం పూర్తి

గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా గాజులపల్లి-చెలిమ మధ్య 320 మీటర్ల పొడవైన రైల్వే సొరంగ నిర్మాణం పూర్తయింది. దీనివల్ల ప్రకాశం, నంద్యాల జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ప్రస్తుతం ట్రాక్ పనులు తుది దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
News February 19, 2026
విజయవాడలో మెడికో మృతి.. వీడని మిస్టరీ..!

విజయవాడ GGHలో ఈనెల 5న <<19055357>>మెడికో దీపిక<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. కుమార్తె చనిపోయి రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదని తండ్రి కోదండరామిరెడ్డి ఆరోపిస్తున్నారు. దీపిక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను మాచవరం పోలీసులు ఓపెన్ చేశారని, FIR, FSL నంబర్ అడిగితే ఇవ్వడంలేదంటున్నారు. ఆమె అందరూ ఉండే ఎమర్జెన్సీ వార్డులో చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ వివరాలను త్వరగా వెల్లడించాలన్నారు.
News February 19, 2026
సోమల: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. గాయపడినవారిది చౌడేపల్లిగా స్థానికులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


