News January 10, 2026

‘గోదావరి’ఖనిలో రెండో మహా జాతర..!

image

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ (జనగామ) శివారులోని గోదావరి నది తీరాన వెలిసిన శ్రీ సమ్మక్క- సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో మాఘ శుద్ధ పౌర్ణమిలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు ఉమ్మడి KNR, ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

Similar News

News March 24, 2026

ఆదర్శ నాయుడి హత్య కేసు.. ఐదుగురి అరెస్ట్

image

రెండు రోజుల కిందట అనంతపురం RTC బస్టాండ్ వద్ద జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు 3-టౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. బన్నీ, కరుణాకర్‌రెడ్డి, రాజేశ్, అస్మిత్ చౌదరి, బండి ఉజ్జనప్పను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆకుల వంశీ కృష్ణపై పాత కక్షతో దాడి చేయాలని యోచించిన నిందితులు, అతనితోపాటు ఉన్న ఆదర్శ నాయుడిపై తీవ్రంగా దాడి చేయగా అతను మృతి చెందారు.

News March 24, 2026

VJA: రూ.44కోట్ల‌తో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు

image

రాష్ట్రంలో రూ.44 కోట్ల‌తో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. 2 నెల‌ల్లోగా ఈ కేంద్రాలను ప్రారంభించడానికి కార్యచరణ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వీటి ఏర్పాటుతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువకానున్నాయన్నారు.

News March 24, 2026

ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

image

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.