News January 10, 2026
764 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(CEPTAM)లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత కలిగినవారు అర్హులు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. టైర్1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.
Similar News
News March 9, 2026
ఆయిల్ ధర $200.. ఇరాన్ వార్నింగ్!

బ్యారెల్ క్రూడాయిల్ ధర $200 దాటినా తట్టుకోగలమంటేనే ఈ యుద్ధ క్రీడలోకి దిగండంటూ US బేస్‌లున్న గల్ఫ్ దేశాలను IRGC అడ్వైజర్ ఇబ్రహీం జబారీ హెచ్చరించారు. ఇరాన్ తన ‘మొజాయిక్ డిఫెన్స్’ వ్యూహం ద్వారా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ టెర్మినల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. 31 ఇండిపెండెంట్ కమాండ్లు, నెలకు 10,000 డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇరాన్ ఏ క్షణమైనా చమురు ఎగుమతులను అడ్డుకోగలదని జబారీ హెచ్చరించారు.
News March 9, 2026
స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఏకంగా 753 పాయింట్ల మేర పడిపోయిన నిఫ్టీ.. మధ్యాహ్నానికి కోలుకుని 24,028(-422) వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద స్థిరపడింది. రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్, మారుతి, SBI, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ₹7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
News March 9, 2026
కేంద్ర మాజీ మంత్రి కావూరి కన్నుమూత: వైఎస్ చౌదరి

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూసినట్లు బీజేపీ ఎమ్మెల్యే వైఎస్ చౌదరి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ట్వీట్లు చేశారు. ఆయనకు సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా కావూరి మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


