News January 10, 2026
పార్వతీపురం: వార్నీ 8 గంటలు లేటు.. ఖాళీగా వెళ్తున్న ట్రైన్

ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్ణీత సమయంలో బయలుదేరకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురం- హైదరాబాద్ 07465 స్పెషల్ రైలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలు ఆలస్యంగా దువ్వాడకు చేరుకుంది. దీంతో రైల్లో ప్రయాణికులు కనిపించలేదు.. సరి కదా వెలవెలబోతూ తన గమ్యస్థానానికి వెళుతోంది.
Similar News
News March 9, 2026
పాలమూరు: RTCలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ

మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో 10 డిపోల గ్యారేజ్, ఆపరేషన్, ఆఫీస్ & వివిద విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MBNR ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా పట్టభద్రులు, నాన్ ఇంజినీరింగ్ పట్టభద్రులు(2021 తర్వాత పాస్ అయినవారు) అర్హులు. ఈ నెల 16లోగా http://nats.education.gov.in వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News March 9, 2026
భూపాలపల్లి: ఆనాటి జగన్మోహిని కేశవ విగ్రహం.. నేడే ప్రతిష్ఠాపన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామ పరిసర ప్రాంతంలోని వాగులో 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి శిలా విగ్రహం ఇటీవల లభించిన విషయం తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జగ్గయ్యపల్లెకి తరలించారు. కాగా, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నేడు జగ్గయ్యపల్లెలో ఉ.8 నుంచి మ.12 వరకు నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.
News March 9, 2026
ఏపీలో సర్పంచ్ ఎన్నికలు.. UPDATE

AP: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన గడువును SEC పొడిగించింది. ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియగా ఈ నెల 18 వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం నియమించిన <<19292949>>ఏకసభ్య కమిషన్<<>> నివేదిక రావడానికి 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.


