News January 10, 2026

మామునూర్ ఎయిర్ పోర్టు రన్ వేలో 3 రోడ్లు!

image

మామునూర్ ఎయిర్ పోర్టు రన్ వే పొడిగింపు కారణంగా R&B రోడ్లు 1.97కి.మీ. పోతున్నాయి. రంగశాయిపేట, చింతనెక్కొండ రోడ్డు 670 మీటర్లు, గుంటూర్‌పల్లి-దూపకుంట పంచాయతీ రాజ్ రోడ్డు 800మీ, గాడిపల్లి-కాపుల కనపర్తి గ్రేటర్ కార్పొరేషన్ రోడ్డు 500 మీ. మొత్తం 1.97 కి.మీ రోడ్డు రన్ వే కారణంగా పోతోంది. ఈ 3 రోడ్ల కారణంగా రంగశాయిపేట-గాడిపల్లి మధ్య రోడ్డు క్లోజ్ అవుతోంది. ప్రత్యామ్నాయంగా మరో రోడ్డును ప్రతిపాదిస్తున్నారు.

Similar News

News February 2, 2026

కూటమి పాలనపై కేంద్రం స్పందించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

image

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారితే దాడులకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

News February 2, 2026

IAFలో అగ్నివీర్ వాయు పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. FEB 1 తేదీ ఆఖరు తేదీ కాగా.. FEB 8 వరకు పెంచారు. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 1, 2006-జులై1, 2009 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎత్తు 152సెం.మీ. ఉండాలి. సైట్: https://iafrecruitment.edcil.co.in

News February 2, 2026

NZB: బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి’

image

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమని, చట్టం ఎవరికీ మినహాయింపు కాదన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేకుండా ట్యాపింగ్ జరగలేదన్నది అవాస్తవన్నారు. సినీ, పారిశ్రామిక ప్రముఖులపై నిఘా, బ్లాక్మెయిల్ జరిగిందని, సిట్ విచారణతో నిజానిజాలు బయటపడాలని పేర్కొన్నారు.