News January 10, 2026
పిల్లల అభ్యసన సామర్ధ్యాలపై ప్రత్యేక చొరవ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎలా చదువుతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి విద్యాశాఖ Foundational Literacy& Numeracy ప్రోగ్రాం చేపట్టింది. 75 రోజులు పాటు విద్యార్థులు చదవడం, రాయడం, లెక్కలు వేయడం ఇలా ఎందులో వెనుబడ్డారు అనేది తెలుసుకుంటారు. వీరిని 3 విధాలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రాథమిక పాఠశాలలు మినహా అన్నింటిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
Similar News
News February 7, 2026
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.
News February 7, 2026
ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూల్ డీఆర్‌వో వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రవాణా, విద్యుత్, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News February 7, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ డెడ్‌లైన్

రష్యాతో తమ యుద్ధాన్ని జూన్ నాటికి ముగించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెడ్‌లైన్ విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అందుకోసం వచ్చేవారం మరో దఫా చర్చలు జరిపేందుకు ఇరు పక్షాలనూ USకు ఆహ్వానించినట్లు చెప్పారు. దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. రష్యా స్టాండ్ ఏంటనేది మాత్రం తెలియదన్నారు. అబుదాబీలో ఇటీవల ముగిసిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరలేదని వెల్లడించారు.


