News January 10, 2026
కర్నూలు పోలీసుల డబ్బుల బేరం.. రంగంలోకి DGP!

KNLలోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకొని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించారు. చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను DGP ఆదేశించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 11, 2026
మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.
News March 11, 2026
కడప: ఇంటర్ పరీక్షలకు 91% విద్యార్థులు హాజరు..!

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ కామర్స్, సోషియాలజీ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 2,723(91%) మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,987 మంది విద్యార్థులకు గాను.. 2,723 మంది పరీక్షలు రాశారు. జనరల్ విద్యార్థుల్లో 2,207 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,083 మంది రాశారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 780 మందికి గాను.. 640 మంది హాజరయ్యారు.
News March 11, 2026
ఆదిలాబాద్ గడ్డపై శంభాజీ మహారాజ్ వీరస్మరణ

ఛత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఆయన ధీరత్వాన్ని స్మరించుకున్నారు. మరాఠా సామ్రాజ్య విస్తరణలో భాగంగా శంభాజీ మహారాజ్ దక్కన్ ప్రాంతంలో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. ADB, నిర్మల్,భైంసా సరిహద్దుల్లో నేటికీ మరాఠా సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. జిల్లాలోని పాత కోట శిథిలాలు, మహోర్ కోట బురుజులు నాటి మరాఠాల వ్యూహాత్మక కట్టడాలకు, శంభాజీ మహారాజ్ అడుగుజాడలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.


