News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. నేలపట్టును చూసేయండి!

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.
Similar News
News February 5, 2026
కృష్ణా: నవోదయలో ఖాళీ సీట్ల భర్తీ.. అడ్మిట్ కార్డ్ విడుదల!

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డి. ఎదునందన తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను cbseitms.rcil.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News February 5, 2026
ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు కాస్త పెరిగాయి. వండర్ హాట్ బుధవారం క్వింటాకు రూ.37,100 ధర పలకగా, గురువారం క్వింటా రూ.900 పెరిగి రూ.38,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి బుధవారం క్వింటాకు రూ.26,200 ధర పలకగా, గురువారం క్వింటాకు రూ.500 పెరిగి క్వింటాకు రూ.26,700 ధర పలికింది. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.200 పెరిగి గురువారం క్వింటాకు రూ.19,500 ధర పలికింది.
News February 5, 2026
GNT: 42 బార్ల కోసం 122 దరఖాస్తులు.. మరికొద్దిసేపటల్లో లాటరీ!

గుంటూరు జిల్లాలో బార్ల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను గుంటూరు కలెక్టరేట్‌లో నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 42 బార్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 122 దరఖాస్తులు వచ్చాయి. జీఎంసీ పరిధిలో 26 బార్లకు 84 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి పరిధిలో 6 బార్లకు 24, పొన్నూరులో ఒక బార్ కి 6 దరఖాస్తులు వచ్చాయి. తెనాలిలో 9 బార్ల కోసం 8 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.


