News January 10, 2026
SHOCKING: ఆన్‌లైన్‌లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.
Similar News
News January 28, 2026
మున్సి’పోల్స్’.. రిజర్వేషన్ల వివరాలు

TG: మున్సిపల్ ఎలక్షన్స్ <<18974641>>షెడ్యూల్<<>> విడుదలైన విషయం తెలిసిందే. 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రిజర్వేషన్ల వారీగా వార్డుల కేటాయింపు చూస్తే.. BCలకు 854(28.5%), SCలకు 444(14.8%), STలకు 187(6.24%), జనరల్ 1,511(50.4%)గా ఉన్నాయి. FEB 11న 8,203 పోలింగ్ స్టేషన్స్‌లో 16,031 బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించనున్నారు. 13న 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
News January 28, 2026
ఈయూ కరెన్సీ విలువ ఎంతో తెలుసా?

యురోపియన్ యూనియన్ కరెన్సీని ‘యూరో’గా పిలుస్తారు. దీని సింబల్ ‘€’. యూరోతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.109.3గా ఉంది. ఒక్క యూరో 1.187 అమెరికన్ డాలర్లు, 0.867 UK పౌండ్లతో సమానం. మొత్తం 21 EU దేశాలు ఈ కరెన్సీని వినియోగిస్తున్నాయి. ఇటీవల బల్గేరియా దేశం యూరోను తన జాతీయ కరెన్సీగా స్వీకరించి ఈ లిస్టులో చేరింది. కాగా భారత్, ఈయూ మధ్య నిన్న ఫ్రీ ట్రేడ్ <<18973548>>అగ్రిమెంట్<<>> జరిగిన సంగతి తెలిసిందే.
News January 28, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.


