News January 10, 2026
రామగుండం: తాళాలు వేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పండుగలు, సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా పరిశీలించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమని తెలిపారు.
Similar News
News March 20, 2026
ఖమ్మం: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన బాలుడు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికను 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైనర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
మడకశిర: అర్ధరాత్రి యాక్సిడెంట్.. యువకుడి మృతి

మడకశిర మండలం అయ్యవారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. చీపులేటి గ్రామనికి చెందిన తిప్పేస్వామి, చంద్రమౌళి బైక్‌పై వెళుతుండగా మార్గంమధ్యంలో ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.


