News January 10, 2026

ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా.. జాగ్రత్త: ఎస్పీ

image

సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ASF జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే ‘డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని SP కోరారు.

Similar News

News March 30, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్: కోమటిరెడ్డి

image

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గేమ్ ఛేంజర్‌గా మారనున్న ట్రిపుల్ ఆర్, బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చెన్నై, పూణే, బెంగళూరులను కలుపుతూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకోసం శంషాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో ఏకంగా 500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన సభలో వెల్లడించారు.