News January 10, 2026

అమెరికాలో సంతమాగులూరు యువకుడి అదృశ్యం

image

అమెరికాలో సంతమాగులూరు యువకుడు అదృశ్యమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కారసాని హరీశ్ రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రంలో ఉంటూ డేవాలీ ప్రాంతానికి ఒక్కడే విహార యాత్రకు వెళ్లాడని సమాచారం. డిసెంబరు 30వ తేదీ నుంచి తల్లిదండ్రులకు గానీ స్నేహితులకు గానీ ఎటువంటి ఫోన్ చేయలేదని, స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు కుటుంబాకులు తెలిపారు.

Similar News

News March 22, 2026

భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

image

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.

News March 22, 2026

ఈ జర్నీ అంత సులభం కాదు: అనయా బంగర్

image

ఇటీవల లింగ మార్పిడి <<19387841>>సర్జరీ<<>> చేయించుకున్న భారత్ మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు అనయా బంగర్ SMలో భావోద్వేగ పోస్ట్ చేశారు. అమ్మాయిగా మారాలనే తన నిర్ణయాన్ని తన తండ్రి, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని తెలిపారు. తన తండ్రి అండగా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనయాబంగర్‌గా గుర్తింపును మార్చుకున్న ఆర్యన్ బంగర్ 2024లో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, రీసెంట్‌‌గా ఈ సర్జరీ చేయించుకున్నారు.

News March 21, 2026

VIJ: అన్న క్యాంటిన్‌లో భోజనం చేసిన కలెక్టర్

image

విద్యాధరపురంలోని అన్న క్యాంటీన్‌లో శనివారం రాత్రి VMC స్పెషల్ ఆఫీసర్ & కలెక్టర్ లక్ష్మీశ భోజనం చేశారు. స్వయంగా తాము క్యూలో ఉండి టోకెన్ తీసుకొని భోజనం చేశారు. క్యాంటిన్ నిర్వహణ, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలు గురించి అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత లోపిస్తే తమకు వెంటనే క్యూఆర్ కోడ్, ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు.