News January 10, 2026
GNT: CRDAలో ఉద్యోగ అవకాశాలు

రాజధాని ప్రాంతంలో CRDAలో పనిచేయుటకు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు తమ వివరాలను గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 12 లోగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు CRDA సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్‌ను సంప్రదించాలని చెప్పారు.
Similar News
News February 4, 2026
కోనసీమ: స్నేహితుడిని బీర్ సీసాతో పొడిచి చంపేశాడు..!

విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుట్కా విక్రయాల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాట్రేనికోనకు చెందిన సాయి (30)ని, అతని స్నేహితుడు నరగడ రాము మద్యం మత్తులో బీర్ సీసాతో పొడిచి చంపేశాడు. ప్లాట్‌ఫారమ్ 7-8 మధ్య జరిగిన ఈ దారుణాన్ని చూసి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 4, 2026
ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ‘సహస్రార చక్రం’

తల పైభాగంలో ఉండే ఈ చక్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం. ఇది సమతుల్యంగా ఉంటే విశ్వంతో సంబంధం ఏర్పడి, అపారమైన జ్ఞానం, ఆనందం కలుగుతాయి. అస్థిరత ఏర్పడితే మానసిక ఒత్తిడి, జీవితంపై విరక్తి, ఒంటరితనం వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి మౌన ధ్యానం శ్రేష్ఠమైనది. తల పైభాగంలో వెలుగు ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానం చేయడం ఓంకారాన్ని పలకడం ద్వారా ఈ చక్రాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇది మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది.
News February 4, 2026
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

కొన్నిచోట్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


