News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్‌లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.
Similar News
News February 6, 2026
తూ.గో: పెళ్లైన ఏడాదికే.. ఘోర విషాదం

హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఉండ్రు సతీశ్ (31) పని ఒత్తిడి తట్టుకోలేక <<19054606>>ఆత్మహత్య<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఐ.పోలవరం మండలం తిల్లకుప్పకు చెందిన ఈయనకు ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ఇటీవల సంక్రాంతికి సతీశ్ సొంత ఊరికి వచ్చి, తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. కుమారుడి మృతితో వ్యవసాయం చేసుకునే అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 6, 2026
BIG SHOCK: అనంతపురంలో పతనమైన ధరలు

అనంతపురం జిల్లాలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గురువారం కుక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.5 నుంచి రూ.11 మధ్య విక్రయాలు జరిగాయి. అత్యధికంగా రూ.5కే అమ్ముడయ్యాయి. పెట్టుబడి పక్కన పెడితే కనీసం కాయ కోత, రవాణా ఖర్చులు కూడా దక్కలేదని రైతులు వాపోతున్నారు. కాగా, ఈ ఖరీఫ్, రబీ సీజన్‌లో 40 వేల ఎకరాల్లో టమాటా సాగు చేశారు. కిలో రూ.20 పలికినా పెట్టబడి దక్కే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 6, 2026
విశాఖలో ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛతా కార్యక్రమాలు

జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆర్కే బీచ్‌లో ‘శిఖర్ సే సాగర్ తక్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం స్వచ్ఛత వాక్, యువతకు 5 కి.మీ.రన్, సైకత శిల్పాల ప్రదర్శన ఉంటాయి. ఆదివారం సైక్లోథాన్, బీచ్ క్లీనింగ్ నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.10 కి.మీ.రన్ రద్దు చేశారన్నారు.


