News January 10, 2026

ASF: 18 కుష్ఠు వ్యాధిగ్రస్థుల నిర్ధారణ

image

ఆసిఫాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కోసం డిసెంబర్‌లో చేపట్టిన ఇంటింటా సర్వే ముగిసింది. 22 ప్రాథమిక, 2 అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ANMలు అనుమానితులను గుర్తించారు. మొత్తం 200 మంది అనుమానితుల్లో 18 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారి తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం రోగుల సంఖ్య 108కి చేరింది. వ్యాధిగ్రస్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

తూ.గో: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ద్వారా అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈనెల 13 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా అభ్యర్థులు Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 5, 2026

12 వరకు క్రీడా పాఠశాల ప్రవేశాలకు గడువు

image

తెలంగాణ క్రీడా పాఠశాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు సూచించారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన అభ్యర్థులకు మండల, జిల్లా స్థాయి ఎంపిక పోటీలను స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 5, 2026

భద్రాద్రి జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం.. పెరిగిన సీట్లు!

image

సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ ఏడాది అవకాశాలు పెరిగాయి. భద్రాద్రిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు అడ్మిషన్ల విభాగం తెలిపింది. రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అత్యధికంగా 480 సీట్లు, మణుగూరులో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.