News January 10, 2026
భూపాలపల్లి: గొంతెమ్మగుట్టపై పురాతన చిత్రకళ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఆది మానవుల చరిత్రను, సంస్కృతిని రికార్డు చేస్తున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, టీం సభ్యులు తాజాగా గొంతెమ్మ గుట్టను సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ప్రతాపగిరి శివారులో ఉన్న చిన్న గుట్టపై మొదటగా బొప్పారం రాజు, రాజేందర్ ధర్మరాజు బృందం ఒక చిత్రాన్ని గుర్తించారు.
Similar News
News February 13, 2026
శ్రీశైలంలో మల్లన్నకు నేడు పుష్ప పల్లకీ సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన నేడు శ్రీశైలం మల్లన్నకు పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి చండీస్వర పూజ, రుద్ర, చండీ హోమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు పుష్కరిణి, శివ దీక్ష శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులను సౌకర్యం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
News February 13, 2026
జనగామ: ఒకే రౌండ్‌లో వార్డుల వారీగా లెక్కింపు!

జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్ 18 వార్డులకు 18 టేబుల్స్‌లో లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 72 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, స్టేషన్ ఘన్పూర్‌లో 20 మంది సూపర్వైజర్లు, 40 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారు.
News February 13, 2026
కృష్ణా: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. కానూరు కుమ్మర్లబజార్‌కు చెందిన బండి క్రాంతికుమార్ 7 నెలల కిందట చిన్నముత్తేవికి చెందిన అమలరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్లే విషయమై ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఈ నెల 11న జరిగిన వాగ్వాదం అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లగా, భర్త ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


