News January 10, 2026
మంచిర్యాల: రిజర్వేషన్‌పైనే ఆశావాహుల ఆశలు

మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్లపై అధికారిక స్పష్టత రానప్పటికీ, పాత, కొత్త ఆశావహులు ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్న నేతలు, తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వార్డుల్లో పర్యటిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Similar News
News March 21, 2026
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్.. మార్చి 25 లాస్ట్ డేట్

మల్కాజ్గిరి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.

సంగారెడ్డి జిల్లాకు మొండిచేయి చూపిన బడ్జెట్.. సీపీఎం ఆగ్రహం

రాష్ట్ర బడ్జెట్‌లో సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. జిల్లాకు అత్యంత కీలకమైన సింగూరు ప్రాజెక్టు అభివృద్ధికి కేవలం ₹44.88 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. అలాగే సంగమేశ్వర, బసవేశ్వర, నారింజ ప్రాజెక్టుల ఊసే లేదని, జిల్లాలోని సాగునీటి రంగంపై బడ్జెట్‌లో వివక్ష చూపారని ఆయన ఆరోపించారు.