News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. నేలపట్టును చూసేయండి!

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.
Similar News
News February 5, 2026
హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కాకాణి

తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సీఎం చంద్రబాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులను కొట్టేయాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, ఆ రెండింటినీ కొట్టేయాలని ఆయన పిటిషన్ వేశారు.
News February 5, 2026
నెల్లూరు: ప్లాట్లు కొన్నారా.. జాగ్రత్త!

NMC పరిధిలో 540 అక్రమ లే అవుట్లలో 5500 ప్లాట్స్‌కు 3500 LRSకు రాగా 2 వేలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బుచ్చిలో 36 లే అవుట్లలో 30 అక్రమం కాగా, 6 మాత్రమే అనుమతి పొంది ఉన్నాయి. వీటిల్లో 800 ప్లాట్లకు నోటీసులు జారీ కాగా, 80 మాత్రమే LRS కు వచ్చాయి. గూడూరులో 70 వరకు అక్రమ లే అవుట్లు ఉండగా.. కావలిలో అక్రమ లే అవుట్లకు LRS లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు.
News February 5, 2026
నెల్లూరు: రైతులే స్వయంగా.. యాప్‌లో పంట నమోదు

APAIMS 2.0 యాప్‌ని ప్రభుత్వం తీసుకోచ్చింది. దీని ద్వారా రైతులే స్వయంగా తమ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మొబైల్‌లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయి MPINను లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రైతు తమ పొలం వద్దకు వెళ్లి ఫోటో దిగి నమోదు చేసుకోవచ్చని ఆశాఖ కోవూరు AD అనిత Way2Newsకి తెలిపారు. విడవలూరులో రైతుల ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆత్మ PD శారద, AO లక్ష్మి చేపట్టారు.


