News January 10, 2026

HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్‌ వాడొద్దు

image

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిరప్‌ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

Similar News

News January 29, 2026

WGL: స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌జీవో)లో స్కౌట్ మాస్టర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ బానేష్ జాడి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం లోగా హన్మకొండ కేయూ రోడ్డులోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాల కోసం 96526 95670 నంబరులో సంప్రదించాలని సూచించారు.

News January 29, 2026

మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఢమాల్

image

మదనపల్లి జిల్లా కేంద్రంలో టమోటా ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. కేవలం 74 వేల కిలోలు (74మెట్రిక్ టన్నులు) మాత్రమే వచ్చాయి. వ్యాపారులు మాత్రం 10 కిలోల మొదటి రకం టమాటాలను రూ.150, రెండో రకం టమాటా రూ.140, మూడో రకం టమాటా రూ.130 తో కొనుగోలు చేసి రైతులను తీవ్ర నిరాశకు గురిచేశారు. రేట్లు పతనం అవడంతో గిట్టుబాటు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News January 29, 2026

కుసుమలో ఆకుమచ్చ తెగులు-నివారణకు సూచనలు

image

ప్రస్తుతం పెరిగిన మంచు తీవ్రత, వాతావరణంలో 70 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు కుసుమ పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకులపై గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను గమనిస్తే లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి తొలిసారి పిచికారీ చేయాలి. మళ్లీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.