News April 25, 2024
సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం లింగమయ్యా…
సలేశ్వరం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. భక్తి పారవశ్యంతో తరలివచ్చారు. శివమామస్మరణాలతో నల్లమల మార్మోగింది. ఈ ఏడాది ఎండల తీవ్రతో భక్తుల రద్దీ తగ్గింది. ఉత్సవాలకు పోలీస్ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వర్షాలు లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు.
Similar News
News January 14, 2025
MBNR: జూ.కళాశాలల్లో సమస్యలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.
News January 14, 2025
MBNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
పాలమూరులో అంబరాన్నంటిన భోగి సంబరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా బంధువులు, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలను వేసి, ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఓ వైపు ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేశారు. మరోవైపు చిన్నారులు గాలిపటాలు ఎగుర వేశారు. కొందరు స్నేహితులతో కలిసి కొత్త సినిమాలను వీక్షించారు.