News January 10, 2026
నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్‌లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్‌తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Similar News
News March 14, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: గుంటూరు ఎస్పీ

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SSS పరీక్షల కోసం గుంటూరు జిల్లాలో 149 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు ఉండగా, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News March 14, 2026
అమరావతిలో స్థలం ఇస్తే స్టూడియో నిర్మిస్తాం: దిలీప్ రాజా

అమరావతిలో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సినిమా షూటింగ్‌లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. సినిమా షూటింగ్‌లకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని, దీనిపై స్పందించాలని కోరారు.
News March 14, 2026
రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


