News January 10, 2026
మదనపల్లె, రాయచోటి బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే ప్రజల నుంచి ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రవాణా శాఖ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మదనపల్లె, రాయచోటి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 22, 2026
కొబ్బరి రేట్లు ఢమాల్

AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ఈ జాబితాలో కొబ్బరి కూడా చేరింది. నెల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ₹22K నుంచి ₹12K-13Kకు పడిపోయింది. రాష్ట్రంలో 2.7L ఎకరాల్లో కొబ్బరి సాగువుతుంది. ఇతర రాష్ట్రాల కొబ్బరిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం వల్ల ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో ఆ కొబ్బరిని దేశీయంగా వినియోగిస్తున్నారు. దీంతో మన కొబ్బరికి గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
News March 22, 2026
కృష్ణా: ‘బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి’

IPL మొదలుకానున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు అంటున్నారు. గతంలో బయటపడిన ప్రధాన బుకీల నెట్‌వర్క్‌లో పెడనకు చెందిన వారి పేర్లు ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల గన్నవరంలో బెట్టింగ్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలైన ఘటన మరువకముందే, మరో సీజన్ ప్రారంభం కానుండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
News March 22, 2026
వికారాబాద్ జిల్లాలో అకౌంట్లోకి డబ్బులు

రైతు భరోసా నగదు రేపు రైతుల ఖాతాల్లో జమకానుంది. తొలి దశలో ఎకరాలోపు రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆ తర్వాత 2, 3 దశల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. VKB జిల్లాలో 3,27,561 లక్షల మంది రైతులు ఉండగా, వీరి 6,45,166 ఎకరాలకుగాను సాయం పొందనున్నారు. జిల్లా రైతుల ఖాతాల్లో రూ.387 కోట్లకుపైగా నిధులు జమకానున్నాయి. జిల్లాలోని పలు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.


