News January 10, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.

Similar News

News February 22, 2026

మాజీ భార్య, కుమారుడికి పాండ్య ఖరీదైన గిఫ్ట్!

image

మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఆల్‌రౌండర్ హార్దిక్ <<19182059>>పాండ్య<<>> కాస్ట్లీ ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.4 కోట్లు. కొంతకాలం క్రితం నటాషాకు విడాకులు ఇచ్చిన పాండ్య.. ఆమెతో పాటు కొడుకు బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే వీరిద్దరికీ కారు కొనిచ్చారట. నటాషా, అగస్త్య కారు షోరూమ్‌లో దిగిన ఫొటోల్లో ‘పాపా టు అగస్త్య’ అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తోంది.

News February 22, 2026

మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

image

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.

News February 22, 2026

హోం క్లీనింగ్ టిప్స్

image

* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది. * మొక్కజొన్న పిండికి కొంచెం నీళ్ళు కలిపి పేస్టు చేసుకొని అద్దాలకు పట్టించి పొడి వస్త్రంతో తుడవాలి. * కంప్యూటర్ కీ బోర్డు, మౌస్ పై మరకలు పడితే వెనిగర్‌లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేయాలి. దీనివల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. * వెండి వస్తువులను సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.